: అగ్రిగోల్డ్ ను మోసపూరిత సంస్థగా తేల్చిన సెబీ


అగ్రిగోల్డ్ సంస్థను మోసపూరిత సంస్థగా సెబీ తేల్చింది. 3 నెలల్లో డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లించాలని ఆదేశించింది. డబ్బులు చెల్లించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. అగ్రిగోల్డ్ ఇన్వెస్ట్ మెంట్స్, కలెక్షన్ స్కీమ్ కింద డబ్బు వసూలు చేశారని, ఇకపై అగ్రిగోల్డ్ ఎండీ సహా డైరెక్టర్లు ఎవరూ వ్యాపార లావాదేవీలు చేయకూడదని సెబీ ఆదేశించింది. కేవలం డబ్బులు వసూలు చేయడమే అగ్రిగోల్డ్ పనిగా పెట్టుకుందని సెబీ వ్యాఖ్యానించింది. తమకు పూర్తి డాక్యుమెంట్లను ఇవ్వలేదని, అగ్రిగోల్డ్ పై ప్రతిచోట క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సెబీ ఆదేశాలు ఇచ్చింది.

  • Loading...

More Telugu News