: ఏపీలో రుణమాఫీ రైతులకు ఊరటనిస్తే, తెలంగాణలో అసలు రుణమాఫీనే చేయలేకపోయారు: ఎర్రబెల్లి


ఆంధ్రప్రదేశ్ లో రుణమాఫీ రైతులకు ఊరటనిచ్చిందని, తెలంగాణలో మాత్రం రైతులకు అసలు రుణమాఫీనే చేయలేకపోయారని టి.టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తన మానిఫెస్టోలో చెప్పినట్టుగా రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో ఒకేసారి రూ.50వేల వరకు రుణమాఫీ చేశారని చెప్పారు. కానీ తెలంగాణలో అసలు రైతుల ఆత్మహత్యలనే పట్టించుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు. పేద రాష్ట్రమైన ఏపీలో రైతులు అత్మహత్య చేసుకుంటే ఐదు లక్షల చొప్పున ఇస్తున్నారని, మరి ఏపీతో అన్నింటిలో పోటీపడే సీఎం కేసీఆర్ రైతుల కుటుంబాలకు పరిహారాన్ని పది లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఆందోళనలకు టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారన్నారు. తమ పోరాటం వల్లే చీఫ్ లిక్కర్ పై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పారు.

  • Loading...

More Telugu News