: మా అమ్మానాన్నలతో ఒక్కసారి మాట్లాడాలని ఉంది!: జడ్జికి పాక్ టెర్రరిస్టు వేడుకోలు
‘జడ్జి గారు..మా అమ్మానాన్నలతో ఒక్కసారి మాట్లాడాలని ఉంది. వాళ్లు నాకు బాగా గుర్తొస్తున్నారు. చాలా కాలంగా నా తల్లిదండ్రులను చూడలేదు. వాళ్ల ఫోన్ నంబరు ఎన్ఐఏకు యిచ్చాను’ అని టెర్రరిస్టు మహమ్మద్ నవేద్ యాకూబ్ కోర్టులో విన్నవించుకున్నట్లు సమాచారం. గత నెలలో ఉధంపూర్ దాడిలో పట్టుబడ్డ పాకిస్థానీ టెర్రరిస్టు నయీద్ జమ్మూలోని ప్రత్యేక కోర్టుకు ఈ విన్నపాన్ని చేసుకున్నాడు. ఎన్ఐఏకు తన తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు ఇచ్చానని, ఒక్కసారి ఫోన్లో మాట్లాడతానని జడ్జిని కోరాడట. కాగా, నవేద్ ఇచ్చిన ఫోన్ నంబర్లు పనిచేయడం లేదని, డిస్ కనెక్టు అయినట్లు ఉన్నాయని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కోర్టుకు చెప్పింది. అయితే, తన మిత్రుల ఫోన్ నంబర్లు కూడా ఎన్ఐఏకు ఇచ్చానని, వాళ్ల ద్వారా తన తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడే ఏర్పాటు చేయాలని నవేద్ కోరుతున్నాడు.