: పిల్లల పరిణతిని పెంచేందుకు క్రీడలు ఎంతో అవసరం: వెంకయ్యనాయుడు
సమాజాన్ని కలిపి ఉంచేందుకు, పరస్పర అంగీకార భావంతో ముందుకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరికీ క్రీడలు ఎంతో ఉపయోగకరమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పిల్లలు క్రీడల్లో రాణించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. జీవన ప్రమాణాల పెంపు, ఆయుష్షు, శక్తి, ఓర్పు, నేర్పునకు క్రీడలు దోహదపడతాయని వివరించారు. హైదరాబాదు రాజేంద్రనగర్ లో సరస్వతి శిశుమందిర్ లో ఏర్పాటుచేసిన సౌత్ ఇండియన్ స్పోర్ట్స్ మీట్ ను వెంకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల స్థాయి, పరిణతిని పెంచేందుకు క్రీడలు ఎంతో అవసరమన్నారు.