: ప్రజలు నమ్ముతున్నారు, నిలబెట్టుకోండి: కలెక్టర్లతో బాబు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలకన్నా మిన్నగా నిలపాలంటే, అధికారులు, ప్రజా ప్రతినిధులు టీమ్ వర్క్ తో ముందుకు సాగాల్సి వుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. విజయవాడలోని తాజ్ గేట్ వే హోటల్ లో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. పట్టిసీమ నుంచి నీరు వదిలిన తరువాత ప్రభుత్వంపై సామాన్య ప్రజలకు నమ్మకం పెరిగిందని, దాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సింగిల్ విండో పాలసీ, విదేశీ పర్యటనలు వృద్ధిపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని ఆయన అన్నారు. టీమ్ వర్క్ సక్రమంగా ఉన్న శాఖల్లో పనితీరు మెరుగుపడి మంచి ఫలితాలు వస్తున్నాయని వెల్లడించిన చంద్రబాబు, మిగతా శాఖల్లో సైతం సమష్టిగా కృషి చేయాలని సూచించారు. పొడవైన సముద్ర తీరం, సహజ వనరులు రాష్ట్రానికి కలిసొచ్చే అంశాలని అన్నారు.

  • Loading...

More Telugu News