: ఇండియాలోని 90 శాతం కంపెనీలకు కొత్త ఉద్యోగులు కావాలట!


ఇండియాలో జాబ్ మార్కెట్ మెరుగుపడింది. దేశంలోని 90 శాతానికి పైగా కంపెనీలు కొత్తగా ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తున్నాయి. ఈ విషయం గ్లోబల్ హెచ్ఆర్ కన్సల్టింగ్ సంస్థ టవర్స్ వాట్సన్ ఆసియా పసిఫిక్ విభాగం చేసిన 'హైరింగ్ సర్వే'లో వెల్లడైంది. ప్రముఖ బిజినెస్ స్కూళ్ల నుంచి డిగ్రీలు పుచ్చుకున్న వారికి ఉపాధి అవకాశాలు సులువుగా లభిస్తున్నాయని ఈ సర్వేను విశ్లేషించిన టవర్స్ వాట్సన్ ప్రతినిధి శాంభవ్ రక్యాన్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఫార్మా, సోషల్ మొబిలిటీ, అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, షేర్ పాయింట్ విభాగాల్లో అత్యధిక ఉద్యోగాలు ఉన్నాయని, ఇక టాప్ సెక్టార్లలోని కంపెనీలు సేల్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో కొత్తగా ఉద్యోగులను తీసుకోనున్నాయని తెలిపారు. వీరికి ఎంట్రీ లెవల్ వేతనం రూ. 10 వేల నుంచి రూ. 60 వేల వరకూ ఉందని, సరాసరిన రూ. 25 వేల వేతనం లభించనుందని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో సరాసరిన రూ. 30 వేల ప్రారంభ వేతన ఆఫర్ ఉండగా, అడ్మినిస్ట్రేషన్, కస్టమర్ సర్వీసెస్, టెక్నికల్ సపోర్ట్ విభాగాల్లో రూ. 16 వేల నుంచి రూ. 18 వేల వరకూ ఆఫర్లు వస్తున్నాయని తెలిపారు. చైనాలో తాజా గ్రాడ్యుయేట్లకు ఇండియాతో పోలిస్తే 40 శాతం అధికంగా వేతనం లభిస్తుండగా, సింగపూర్ గ్రాడ్యుయేట్లకు ఏకంగా ఐదు రెట్ల వేతనం దొరుకుతోందని, ఇండియాలో ఎంబీఏ విద్యను పూర్తి చేసుకున్న వారికి రూ. 14 వేల నుంచి రూ. 1.44 లక్షల వరకూ నెలవారీ వేతనం ఆఫర్లు వస్తున్నాయని, ఈ విభాగంలో సరాసరిన రూ. 40 వేల జీతం లభిస్తోందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News