: తల్లిదండ్రులు లేని అనాధలు ఇక 'బీసీ'లే!


నేడు సమావేశం కానున్న తెలంగాణ మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అనాధలను వెనుకబడిన తరగతుల జాబితాలో చేరుస్తూ కేసీఆర్ టీం ఆమోదం తెలపవచ్చని సమాచారం. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం తల్లిదండ్రులు, అయినవారు లేని వారిని బీసీల జాబితాలో చేర్చాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనాధల సంరక్షణకు ప్రత్యేక విధానం అమలు చేయాలన్న ఉద్దేశంతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని కేసీఆర్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సైతం బీసీ-ఏ జాబితాలో అనాధలను చేర్చాలని సిఫార్సులు చేయగా, వాటిని కేసీఆర్ ఆమోదించారు. ఇక క్యాబినెట్ నిర్ణయం లాంఛనమే. ఇదిలావుండగా, వడ్డెరలను సైతం బీసీ కులాల జాబితాలో చేర్చే ప్రతిపాదన కూడా మంత్రిమండలి ఆమోదానికి రానున్నట్టు తెలుస్తోంది. బీసీ కులాల జాబితాలో 'వడ్డె' అన్న పదం మాత్రమే వుంది. వాడుకలో వీరందరినీ 'వడ్డెర'లుగానే పిలుస్తున్న నేపథ్యంలో వడ్డెరల పదాన్ని బీసీ కులాల జాబితాలో చేర్చాలని టీఎస్-సర్కారు భావిస్తోంది.

  • Loading...

More Telugu News