: హెచ్ఐఎల్ సిత్రాలు... మనవాళ్లకన్నా పొరుగోళ్లే మిన్న!


హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) వేలంలో భారత ఆటగాళ్లతో పోలిస్తే, విదేశీయులను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ముఖ్యంగా జర్మనీ ఆటగాళ్లను తీసుకునేందుకు లక్షలు వెచ్చించాయి. రెండు ఒలింపిక్స్ పతకాలు నెగ్గిన జర్మనీ జట్టులోని కీలక ఆటగాడు మెరిట్జ్ పుర్ స్టే కోసం కళింగ లాన్సర్ రూ. 69.46 లక్షల ఆఫర్ ఇచ్చింది. ఈ లీగ్ లో అత్యధిక ధర పలికిన ఆటగాడు ఇతడే. టాప్-3లోని ఆటగాళ్లందరూ జర్మన్లే కావడం గమనార్హం. ఆ జట్టుకు చెందిన ఫ్లోరియన్ కోసం దబాంగ్ ముంబై జట్టు, తొబియన్ హక్ కోసం యూపీ జట్టు రూ. 63.53 లక్షల చొప్పున వెచ్చించాయి. భారత ఆటగాళ్లలో ఆకాశ్ దీప్ సింగ్ కు యూపీ విజార్డ్స్ ఫ్రాంచైజీ రూ. 55.56 లక్షలను కేటాయించింది. సీనియర్ ఆటగాడు సందీప్ సింగ్ ను రాంచీ రేస్, గుర్మైల్ సింగ్ ను దబంగ్ ముంబై టీంలు రూ. 53.57 లక్షలతో కొన్నాయి. భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ అంచనాలను అందుకోలేకపోయాడు. అతన్ని రూ. 38.36 లక్షలకు జేపీ పంజాబ్ వారియర్స్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియన్ హాకీ దిగ్గజం జేమీ డ్వయర్ ను యూపీ విజార్డ్స్ టీం రూ. 37.53 లక్షలకు కొంది. కాగా, వచ్చే సంవత్సరం హాకీ లీగ్ పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News