: దళితుడనైనందునే నా పట్ల వివక్ష చూపుతున్నారు!: టీఆర్ఎస్ ఎంపీ సుమన్ ఆవేదన


తన పేరు వెనుక శర్మ, రెడ్డి, రావు లేవనే కారణంతోనే అధికారిక కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యత లభించడం లేదని టీఆర్ఎస్ యువ ఎంపీ బాల్క సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ సీనియర్ ఎంపీ వినోద్ సమక్షంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం దళితుడనైనందునే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకుండా వివక్ష పాటిస్తున్నారని ఆరోపించారు. తన పేరు వెనుక శర్మ, రెడ్డి, రావు ఉండి ఉంటే ఇంతటి నిర్లక్ష్యం చూపించేవారా? అని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఒకవేళ పిలిచినా ఇన్విటేషన్లలో తన పేరు ఎక్కడో మూలన ఉండేలా జాగ్రత్త పడుతున్నారని సుమన్ విమర్శించారు. ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ పై ఉంటుందని ఆయన తెలిపారు. పీఆర్వో అతి తెలివి చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను వాకౌట్ చేయాలని సమావేశానికి హాజరయ్యానని, కానీ సీనియర్ నేతలు ఉండడం, వారిపైనున్న గౌరవంతో తాను ఆ పని చేయడం లేదని సుమన్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News