: జంషెడ్ పూర్ వద్ద పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్ ప్రెస్
రాజధాని ఎక్స్ ప్రెస్ రైలుకు డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. భువనేశ్వర్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ఈ రైలు జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ వద్ద పట్టాలు తప్పింది. టాటానగర్ స్టేషన్ వద్ద రాజధాని ఎక్స్ ప్రెస్ ఇంజిన్ కు సంబంధించిన రెండు పట్టాలు తప్పాయి. దీనిని గుర్తించిన డ్రైవర్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ఇంజిన్ మార్చి, పట్టాలు సరిచేశారు. దీంతో రైలు గంటపాటు ఆలస్యంగా నడిచింది. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని రైల్వే అధికారులు తెలిపారు.