: బీహార్ ఎన్నికల్లో గుర్తుండిపోయే ఎన్నికల గుర్తులు!


బీహార్ రాష్ట్రంలో ఎన్నికల గుర్తుకు ఏదీ కాదు అనర్హం అనిపిస్తోంది. ఎందుకంటే, వీటిలో మనం నిత్యం వాడుకలో ఉపయోగించేవి కొన్నయితే, నిత్యావసరాలు మరికొన్ని. ఆ గుర్తులు ఏంటయ్యా అంటే... ఐస్ క్రీమ్, మిర్చి, క్యాలీ ఫ్లవర్, టెలిఫోన్, షూ, చెప్పులు, బకెట్...ఇలా కొనసాగుతాయి. రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఈ గుర్తులను కేటాయించింది. బీహార్ మాజీ సీం మాంఝీ పార్టీ అయిన హిందూస్థానీ ఆవామ్ మోర్చాకు టెలిఫోన్ గుర్తు కేటాయించారు. ఆ పార్టీ పోటీ చేయనున్న అన్ని సీట్లలోనూ ఇదే గుర్తుతో పోటీ చేస్తుంది. లోక్ ఆవాజ్ దళ్ పార్టీకి మిర్చి గుర్తు, ఆమ్ జనతా పార్టీ రాష్ట్రీయకు ఐస్ క్రీమ్ గుర్తును కేటాయించారు. బీహార్ రాష్ట్రంలో ఎన్నికల గుర్తులే కాదు, పార్టీల పేర్లు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. నేషనల్ టైగర్ పార్టీ, నేషనల్ రోడ్ మ్యాప్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆప్ ఔర్ హమ్ పార్టీ వంటివి ఇక్కడ ఉన్నాయి.

  • Loading...

More Telugu News