: నెదర్లాండ్స్ పోలీసులను పరుగులు పెట్టించిన ఆగంతుకుడు


నెదర్లాండ్స్ పోలీసులను ఒక ఆగంతుకుడు ఉరుకులు పరుగులు పెట్టించాడు. ది హేగ్ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఆమ్ స్టర్ డామ్ నుంచి పారిస్ వెళ్తున్న థలీన్ హై స్పీడ్ రైలు టాయిలెట్ లోకి వెళ్లిన ఓ వ్యక్తి ఎంత సేపటికీ బయటకు రాలేదు. దీంతో రైలు ప్రయాణికులు పోలీసులకు సమాచారమందించారు. దీంతో రంగప్రవేశం చేసిన డచ్ పోలీసులు రోట్టర్ డామ్ రైల్వే స్టేషన్ లో రైలు ను నిలిపేసి అతనిని బయటకు రమ్మని సూచించారు. అతను ఎంతకీ రాకపోవడానికి తోడు, అతని వద్ద బాంబును చూసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో సగం స్టేషన్ ను ఖాళీ చేయించారు. ఆ స్టేషన్ మీదుగా వెళ్తున్న రైళ్లను దారి మళ్లించారు. భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించి, ఎట్టకేలకు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర్నుంచి ఏం స్వాధీనం చేసుకున్నారో వెల్లడించకపోవడం విశేషం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News