: గణేష్ నిమజ్జనానికి 7 వేల మంది సిబ్బందితో భద్రత


రానున్న గణేష్ నిమజ్జనం, బక్రీద్ పండుగల సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 7 వేల మంది సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేస్తున్నామని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. బందోబస్తు కోసం రెండు వేల మంది ఒడిశా, ఛత్తీస్ గఢ్ పోలీసులను రప్పిస్తున్నామని చెప్పారు. దీనికితోడు, రెండేసి కంపెనీల ఆర్ఏఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలను కూడా ఉపయోగించుకోనున్నామని వెల్లడించారు. అలాగే, ఆదిభట్ల పోలీస్ స్టేషన్ కు రూ. 2 కోట్లతో అన్ని హంగులను సమకూరుస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News