: అది ఎల్లో జర్నలిజం : బీజేపీ ఎంపీ అక్బర్
ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని కలిశారంటూ వచ్చిన వార్తలను బీజేపీ ఎంపీ ఏజే అక్బర్ కొట్టి పారేశారు. ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అక్బర్ మాట్లాడారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన నేపథ్యంలో ఒక పత్రిక ఈ రాతలు రాసిందన్నారు. ఆ పత్రిక రాసిన విధానం చూస్తుంటే అది ఎల్లో జర్నలిజంగా ఉందంటూ ఆయన మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీకి నష్టం చేకూర్చేలా రాసిన ఆ పత్రికపై తమ పార్టీ పరువు నష్టం దావా వేస్తుందన్నారు.