: జీహెచ్ఎంసీ పరిధిలో సీమాంధ్రుల ఓట్లు తొలగిస్తున్నారు: ఉత్తమ్


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓట్ల తొలగింపుపై టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సీమాంధ్రుల ఓట్లను తొలగిస్తూ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఓట్ల తొలగింపు కార్యక్రమం అంతా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు. దాదాపు 17 లక్షల మంది ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని మీడియా సమావేశంలో అన్నారు. ఒక్క సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోనే 31వేల మంది ఓట్లను తొలగించేందుకు మార్క్ చేసినట్టు ఉత్తమ్ తెలిపారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల కేటాయింపుల్లోనూ అవకతవకలు జరుగుతున్నాయన్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో ఓట్ల తొలగింపుపై టి.కాంగ్రెస్ నేతలు దానం నాగేందర్, తదితరులు ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ ను కలసి ఫిర్యాదు చేశారు. అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News