: బంజారాహిల్స్ లో రికార్డింగ్ డ్యాన్స్, పట్టించుకోని పోలీసులు!


కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తిరుణాళ్లు, శ్రీరామనవమి ఉత్సవాలు తదితరాల సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. వీటిపై నిషేధం అమలవుతున్నా, వీటిని ఖాతరు చేసే గ్రామాలు అతి తక్కువ సంఖ్యలోనే కనిపిస్తాయి. అయితే, హైదరాబాద్ లో రికార్డింగ్ డ్యాన్సులు అసలు లేవనే చెప్పాలి. ఈ తరహా కార్యక్రమాలు బహిరంగంగా జరగక ఏళ్లు గడిచింది. కానీ, నిన్న రాత్రి బంజారాహిల్స్ లోని సైదప్ప కాలనీలో జరిగిన రికార్డింగ్ డ్యాన్స్ పోలీసుల తీరును ప్రశ్నిస్తోంది. తొలుత ఆర్కెస్ట్రాతో మొదలై, ఆపై అసభ్యకర నృత్యాలు జరిగాయని, పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ ల మధ్య బహిరంగంగా ఈ కార్యక్రమం జరిగినా పోలీసులు పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసు అధికారులు ఇంతవరకూ నోరు మెదపలేదు.

  • Loading...

More Telugu News