: పట్టిసీమ మొదటి పంపు నుంచి నీటి విడుదల
పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టిసీమ ఎత్తిపోతల పథకం మొదటి పంపునుంచి నీటిని విడుదల చేశారు. మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మొదటి పంపు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. దీని ద్వారా 350 క్యూసెక్కుల నీరు విడుదలైంది. అంతకుముందు ఆయన పూజలు నిర్వహించారు. కాగా రెండు రోజులుగా మంత్రి, అధికారులు అక్కడే ఉండి పట్టిసీమ పనులను పర్యవేక్షించారు.