: 'డెంగీ'పై సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం


దేశ రాజధాని ఢిల్లీ సహా దేశాన్ని వణికిస్తున్న డెంగీపై ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తనదైన శైలిలో స్పందించాడు. ఒడిశాలోని పూరీ తీరంలో డెంగీపై ఇసుకతో అద్భుతంగా సైకత శిల్పం రూపొందించాడు. డెంగీ వ్యాధిని అరికట్టాలంటూ సందేశం ఇచ్చాడు. చూపరులను ఆకట్టుకుంటున్న ఆ శిల్పం పలువురిని ఆలోచింపజేస్తోంది. మరోవైపు ఢిల్లీ, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు డెంగీతో 16 మంది మరణించారు. పలు రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. డెంగ్యూ బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

  • Loading...

More Telugu News