: భారత బోటుపై దాడి చేసిన పాక్ తీర రక్షక దళం... మత్స్యకారుడి మృతి


గుజరాత్ తీరం వెంబడి అంతర్జాతీయ జలాల్లో ఉన్న భారత మత్స్యకారుల బోటుపై పాక్ తీర రక్షక దళం దాడి చేసింది. పాక్ దళం జరిపిన కాల్పుల్లో బోటులోని ఇక్బాల్ అనే భారతీయ మత్స్యకారుడు మరణించాడు. ప్రేమ్ రాజ్ అనే పేరున్న ఈ బోటు 8వ తేదీన ఐదుగురు మత్స్యకారులతో ఓఖా తీరం నుంచి బయలుదేరినట్టు తెలుస్తోంది. ఈ బోటులో మరణించిన ఇక్బాల్ పోరుబందర్ పట్టణానికి చెందినవాడని అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న భారత కోస్ట్ గార్డ్ రెండు చిన్న షిప్ లను ఆ ప్రాంతానికి పంపింది. జరిగిన ఘటనపై విచారించడంతో పాటు, ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్స్ మొదలు పెట్టినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News