: సైనా కల నెరవేరింది... షారుఖ్ ని కలిసింది!


ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కల నెరవేరింది. ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్న బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ను నేడు కలిసింది. షారూఖ్ తాజా సినిమా దిల్ వాలే షూటింగ్ హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. దీంతో షారూఖ్ ను కలవాలనుందంటూ సైనా ట్విట్టర్ ద్వారా షారూఖ్ కు తెలిపింది. దీనిని చూసిన షారూఖ్ షూటింగ్ స్పాట్ కు ఆహ్వానించారు. అనంతరం ఫిల్మ్ సిటీలో సైనా తన సోదరితో కలిసి షారూఖ్ ను కలిసింది. ఈ సందర్భంగా షారూఖ్ అద్భుతమైన వ్యక్తి అని ఆమె కొనియాడింది. షూటింగ్ చూపించినందుకు దర్శకుడు రోహిత్ శెట్టికి సైనా ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా షూటింగ్ లో అందరితో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

  • Loading...

More Telugu News