: గోదావరి పుష్కరాల దుర్ఘటనపై విచారణకు కమిటీ నియామకం


గోదావరి మహాపుష్కరాల తొలిరోజు జరిగిన దుర్ఘటనపై న్యాయవిచారణ జరిపించేందుకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సీవై సోమాయాజులు నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఈ ఘటనపై విచారణ చేయనుంది. విచారణకు ఆరు నెలల గడువు విధించారు. గత జూన్ లో రాజమండ్రి వద్ద జరిగిన గోదావరి నది పుష్కరాల మొదటిరోజు తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో 25 మంది మరణించగా, పలువురికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సీఎం చంద్రబాబే ప్రధాన కారణమని, డాక్యుమెంటరీ తీయడం కోసం షూటింగ్ చేసేందుకు భక్తులను ఆపారంటూ విపక్షాలు విమర్శించాయి. అప్పుడే విచారణ జరిపించాలని డిమాండ్ కూడా చేశారు. కానీ, ఘటన జరిగిన ఇన్నాళ్ల తరువాత ప్రభుత్వం కమిటీని నియమించడం గమనార్హం.

  • Loading...

More Telugu News