: నిలకడగా బీసీసీఐ చీఫ్ దాల్మియా ఆరోగ్యం


బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఆరోగ్య పరిస్థితిపై కోల్ కతాలోని బీఎమ్ బిర్లా ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని పేర్కొన్నారు. మరో 72 గంటల పాటు ఆయన్ను అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు తెలిపారు. నిన్న (గురువారం) రాత్రి 9 గంటల సమయంలో హఠాత్తుగా దాల్మియాకు ఛాతి నొప్పి రావడంతో కుటుంబసభ్యులు బిర్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కరొనరీ యాంజియోగ్రఫీ నిర్వహించి ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News