: మామూలు ఫైళ్లే... నేతాజీ మరణ రహస్యాలేం లేవు!
పశ్చిమ బెంగాల్ సర్కారు ఈ ఉదయం బహిర్గతం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన 64 సీక్రెట్ ఫైళ్లలో ఆయన గురించిన రహస్యాలు ఎంతమాత్రమూ లేవని తెలుస్తోంది. వీటిని చూస్తే, ఆయన ఎలా, ఎప్పుడు మరణించారన్న విషయం వెలుగులోకి వస్తుందని భావించిన ప్రజలకు నిరాశే మిగిలింది. ఈ ఫైల్స్ వెల్లడించే అంశాలను తెలుసుకోవాలని టీవీలకు అతుక్కుపోయిన వారిని ఇవి ఉసూరుమనిపించాయి. దీనికిమించి ఆయన మరణం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలింది. కాగా, ఇప్పటికే తమ వద్ద ఉన్న నేతాజీ ఫైల్స్ ను బహిర్గతం చేయలేమని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. మమత సర్కారు మాత్రం బెంగాల్ అధీనంలో ఉన్న వాటిని బయట పెట్టింది. తనకు సహాయపడాలంటూ, ఆయన రాసిన కొన్ని లేఖలు ఈ ఫైల్స్ లో ఉన్నాయని, బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన సాగిస్తున్న చర్యలపై అప్పటి ప్రభుత్వం జరిపించిన విచారణ వివరాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఆయన తైవాన్ లో మరణించలేదని, 1964 వరకూ బతికే ఉన్నారని అమెరికా రహస్య పత్రం ఒకటి చెబుతోంది.