: పాలమూరులో ప్రొటోకాల్ రగడ... బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట


తెలంగాణలోని వెనుకబడ్డ పాలమూరు జిల్లాలో ప్రొటోకాల్ వివాదం చెలరేగింది. పాలమూరు జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ లో ఓ అభివృద్ధి పనిని ప్రారంభించేందుకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి నేటి ఉదయం అక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ హోదాలో బీజేపీ నేత రామచంద్రారావు కూడా హాజరయ్యారు. అయితే శిలాఫలకంపై రామచంద్రారావు పేరు లేని విషయాన్ని గుర్తించిన బీజేపీ నేతలు, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి ప్రొటోకాల్ నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల నినాదాలపై టీఆర్ఎస్ కార్యకర్తలు, మంత్రి అనుచరులు భగ్గుమన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకానొక సందర్భంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసి అక్కడి నుంచి పంపించివేశారు.

  • Loading...

More Telugu News