: భార్యను చంపడానికి రెండుసార్లు ప్రయత్నించిన ఆప్ మాజీ మంత్రి!
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమ్ నాథ్ భారతి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తన భర్త తనను హింసించడంతో పాటు, హత్య చేయడానికి కూడా యత్నించారని సోమ్ నాథ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. కేసు పురోగతిని ఢిల్లీ హైకోర్టుకు తెలుపుతూ, తన భార్యను హత్య చేసేందుకు సోమ్ నాథ్ భారతి రెండు సార్లు ప్రయత్నించారని పోలీసులు కోర్టుకు విన్నవించారు. తొలి యత్నం ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు జరిగిందని, రెండోసారి ఆమె మణికట్టును చీల్చి చంపడానికి యత్నించారని కోర్టుకు తెలిపారు.