: తెలుగులోనే ఏఈఈ జనరల్ స్టడీస్ పేపరు: టీఎస్ పీఎస్ ఛైర్మన్
ఏఈఈ పరీక్షల్లో భాగంగా జనరల్ స్టడీస్ పేపర్ తెలుగులో ఇవ్వాలన్న అభ్యర్థనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్) సుముఖత వ్యక్తం చేసింది. ఆ పేపర్ తెలుగులోనే ఇవ్వాలని నిర్ణయించినట్టు కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. అయితే రెండో పేపర్ మాత్రం ఆంగ్లంలోనే రాయాల్సి ఉంటుంది. ఎల్లుండి జరగనున్న ఏఈఈ ఆన్ లైన్ పరీక్షకు సంబంధించి హైదరాబాదులోని కార్యాలయంలో ఛైర్మన్ అధ్యక్షతన సమీక్ష జరిగింది. 20న నిర్వహించే ఆన్ లైన్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతకుముందు ఈ పరీక్షను ఆంగ్లంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. అయితే దానివల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్ష రాసే అభ్యర్థులకు నష్టం జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.