: శ్రీనివాసన్ పై సుప్రీంకోర్టులో బీసీసీఐ పిటిషన్
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ ఎన్.శ్రీనివాసన్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీసీసీఐ సమావేశాలకు ఆయన తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడి హోదాలో పాల్గొనడంపై స్పష్టత ఇవ్వాలని బీసీసీఐ కోరింది. అధికారిక సమావేశాలకు శ్రీని పాల్గొనడాన్ని బీసీసీఐ వ్యతిరేకిస్తోంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీలో శ్రీనికి చెందిన ఇండియా సిమెంట్స్ వాటాలే ఉన్నాయని పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ సమావేశాలకు ఆయన రావడాన్ని వ్యతిరేకిస్తున్నారు.