: నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేసిన పశ్చిమబెంగాల్ ప్రభుత్వం


ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన ఫైళ్లను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. మొత్తం 64 రహస్య ఫైళ్లను నేడు కుటుంబ సభ్యులకు అందజేసింది. ప్రజల సందర్శనార్థం వచ్చే సోమవారం నుంచి అంటే ఈ నెల 21 నుంచి కోల్ కతా పోలీస్ మ్యూజియంలో నేతాజీ ఫైళ్లను ఉంచనున్నారు. గత దశాబ్దాల నుంచి మిస్టరీగా ఉన్న నేతాజీ మరణం, ఆయనకు సంబంధించిన పలు విషయాలు ఈ దస్త్రాల ద్వారా తెలిసే అవకాశం ఉంది. ఓ విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కాదు ఆయన బతికే ఉన్నారంటూ మరికొంతమంది వాదించారు. ఈ నేపథ్యంలో నేతాజీకి సంబంధించిన కొన్ని విషయాలు ఈ ఫైళ్లలో ఉండవచ్చని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News