: కోదండరాముని నగదు దొంగిలించిన అర్చకుడికి ఏడేళ్ల జైలు శిక్ష


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి అనుబంధంగా ఉన్న తిరుపతి కోదండ రామాలయంలో స్వామివారి ఆభరణాలు దొంగిలించి, వాటిని తాకట్టు పెట్టి కుటుంబ అవసరాలకు వాడుకున్న ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 11 వేల జరిమానా విధిస్తూ, తిరుపతి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి సన్యాసినాయుడు తీర్పిచ్చారు. దేవుడి నగలని తెలిసి కూడా వీటిని తాకట్టు పెట్టుకున్న సాగరమల్లు, రాఘవరెడ్డి అనే వ్యాపారులకు ఏడాది జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధించారు. శ్రీ కోదండరామాలయం ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులు దశలవారీగా కంటి ఆభరణం, చంద్రహారం, బంగారు చైన్, అతుకుల చైన్, లక్ష్మీ హారం, కాసులదండ తదితర స్వామి నగలను తీసుకెళ్లి వాటిని రూ. 8.70 లక్షలకు తాకట్టు పెట్టాడు. 2009లో ఈ ఘటనల వెలుగులోకి రాగా, టీటీడీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు విచారణ జరిపి రమణ దీక్షితులును అరెస్ట్ చేసి, మూడు కేసులు పెట్టి చార్జ్ షీట్లను దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి నిందితులు తప్పు చేశారని అభిప్రాయపడ్డారు. సాక్ష్యాలు బలంగా ఉన్నాయని వ్యాఖ్యానించిన ఆయన, మూడు కేసుల్లో శిక్ష ఒకేసారి అమలు చేయాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News