: ఒబామాకు నోబెల్ ఇచ్చి తప్పుచేశామంటున్న ఎన్ఎన్ఐ మాజీ డైరెక్టర్
యూఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చి తప్పు చేశామని ఎన్ఎన్ఐ (నార్వే నోబెల్ ఇనిస్టిట్యూట్) మాజీ డైరెక్టర్ లుండెస్టెడ్ అభిప్రాయపడ్డారు. శాంతి బహుమతి ఆయనకు ఇస్తే, అది ప్రపంచ శాంతి దిశగా ఒబామాను ప్రోత్సహిస్తుందని భావించామని, నోబెల్ కమిటీ ఏదైతే ఆశించి 2009లో ఆయనకు అవార్డును ప్రకటించిందో, ఆ ఆశలను నెరవేర్చడంలో ఒబామా విఫలమయ్యాడని ఆయన ఆరోపించారు. తనకు శాంతి బహుమతి వచ్చిందంటే, ఆయనే నమ్మలేకపోయారని అన్నారు. ఆయన అనుయాయులు కూడా అవార్డుల కమిటీ తప్పు చేసిందని ఇప్పటికీ భావిస్తున్నారని తాను రాసిన పుస్తకంలో లుండెస్టెడ్ వివరించారు. నోబెల్ శాంతి బహుమతికి ఒబామా అర్హుడు కాదని చాలా మంది అమెరికన్లు అభిప్రాయపడుతున్నట్టు తెలిపారు.