: అమరావతికి తరలివచ్చిన కేంబ్రిడ్జి వర్శిటీ
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జి యూనివర్శిటీ తన శాఖను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి సుజనా చౌదరి సమక్షంలో ఒప్పందం కుదిరింది. కేంబ్రిడ్జి ప్రతినిధి జెన్నిఫర్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఉన్నత విద్య, పరిశోధన, నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలు తదితర అంశాలపై ఏపీ ప్రభుత్వంతో తాము కలసి పనిచేయనున్నట్టు ఈ సందర్భంగా జెన్నిఫర్ వ్యాఖ్యానించారు. తమ విశ్వవిద్యాలయానికి వచ్చే నిధులు, విరాళాలను ఇండియాలో విద్యా ప్రమాణాల అభివృద్ధికి వెచ్చిస్తామని ఆమె తెలిపారు. కాగా, త్వరలో వర్శిటీకి చెందిన ముగ్గురు అధికారులు రాష్ట్రాన్ని సందర్శించనున్నారని, మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.