: ఆపరేషన్ చేయడం లేదని... ఆసుపత్రిలో ఉరేసుకున్న రోగి


ఆత్మహత్యలకు దారితీస్తున్న కారణాల జాబితా నానాటికీ పెరిగిపోతోంది. సాగులో నష్టాలతో అప్పుల్లో కూరుకుపోయిన అన్నదాతలు సర్కారు నుంచి సాయమందక ఉరికంబమెక్కుతున్నారు. విద్యాలయాల్లో ర్యాగింగ్, అధ్యాపకుల వేధింపులు తాళలేక కూడా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆపరేషన్ చేయలేదన్న కారణంతో ఓ రోగి చికిత్స కోసం చేరిన ఆసుపత్రిలోనే ఉరేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నేటి ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఓ రోగి, తన రోగం నయం కావాలంటే ఆపరేషన్ చేయాల్సిందేనని వైద్యులను వేడుకుంటున్నాడు. అయితే పలు చికిత్సలు చేసిన వైద్యులు అతడికి ఆపరేషన్ చేయడంలో కాస్తంత ఆలస్యం చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు ఆపరేషన్ ఎప్పుడు జరుగుతుందోనన్న విషయంపైనా స్పష్టత రాకపోవడంతో సదరు రోగి ఆసుపత్రిలోనే ఉరేసుకుని తనువు చాలించాడు. దీంతో ఆసుపత్రిలో కలకలం రేగింది.

  • Loading...

More Telugu News