: ఒక్కరోజే హైదరాబాదులో... మరికాసేపట్లో విజయవాడకు చంద్రబాబు


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏపీ పాలనపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఇప్పటికే వారంలో ఐదు రోజులు విజయవాడలోనే ఉంటానని ప్రకటించిన చంద్రబాబు ఒక రోజు అదనంగానే విజయవాడలో ఉంటున్నారు. గత వారం సాంతం విజయవాడలోనే ఉన్న ముఖ్యమంత్రి నిన్న ఉదయం హైదరాబాదు వచ్చారు. ఒకే ఒక్క రోజు హైదరాబాదులో ఉన్న ఆయన మరికాసేపట్లో విజయవాడ బయలుదేరనున్నారు. విజయవాడ వెళ్లగానే జిల్లాల కలెక్టర్లతో ఆయన భేటీ కానున్నారు. నేడు, రేపు రెండు రోజుల పాటు విజయవాడలో జరిగే ఈ భేటీలో ప్రభుత్వ పథకాల అమలుపై సుదీర్ఘ చర్చ జరగనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News