: మోదీ ప్రభ వెలిగిపోతోంది... ప్రధానికి 87 శాతం మంది అనుకూలమే!: అమెరికా సంస్థ ‘ప్యూ’ వెల్లడి
నరేంద్ర మోదీకి మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంతో పోల్చుకుంటే, నానాటికీ ప్రజాదరణ తగ్గిపోతోందని దేశంలోని పలు సర్వేలు చెబుతున్నాయి. అంతేకాక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చాలా వాటిని అమలు చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని కూడా ప్రజలు వాపోతున్నారని సదరు సర్వేలు తేల్చాయి. ఇక కాంగ్రెస్ పై బీజేపీ ప్రయోగించిన ప్రధాన అస్త్రం ‘నల్లధనం దేశానికి రప్పిస్తాం’ అన్న విషయంలోనూ ప్రధాని మోదీ ఒక్క అడుగు కూడా ముందుకేయలేకపోతున్నారని ఆ సర్వేలు గగ్గోలు పెట్టాయి. అయితే అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ‘ప్యూ’ సంస్థ చేసిన సర్వేలో ఇందుకు విరుద్ధ ఫలితాలు వచ్చాయి. ఇప్పటికీ దేశంలోని 87 శాతం మంది ప్రజలు మోదీకి అనుకూలంగానే ఉన్నారని ఆ సంస్థ వెల్లడించింది. మరో ఆశ్చర్యకర విషయమేంటంటే, కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న గ్రామీణ భారతంలోనూ మోదీ ప్రభ వెలిగిపోతోందని ఆ సంస్థ సర్వే తేల్చిచెప్పింది.