: డాడీ... మీ పరువు నిలబెడతా!: చిరంజీవికి వరుణ్ తేజ్ హామీ


కథలు రాయడం ఓ కళ అయితే, ఆ కథను విజువల్ గా ఊహించడం ఎంతో కష్టమైన పని, అలాంటి పనిని క్రిష్ సులువుగా చేశారని వరుణ్ తేజ్ దర్శకుడికి కితాబిచ్చాడు. 'కంచె' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, 'డాడీ (నాగబాబు కొడుకైన వరుణ్ చిన్నప్పటి నుంచీ చిరంజీవిని అలాగే పిలుస్తాడు)! మీ పరువు నిలబెట్టే సినిమా చేశాను' అని వరుణ్ ధీమాగా అన్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత బాబాయి (పవన్ కల్యాణ్) కి చూపిస్తానని వరుణ్ చెప్పాడు. తన కుటుంబంలో ప్రతి ఒక్కరూ తనకు సహాయం చేశారని, వారందరికీ ధన్యవాదాలని వరుణ్ తేజ్ తెలిపాడు. సినిమా షూటింగ్ మధ్యలో సన్నివేశం పూర్తయిన తరువాత డైరెక్టర్ క్రిష్ దగ్గరకెళ్లి మీకిలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? అని అడిగే వాడినని, అంత అద్భుతమైన సన్నివేశాలు తీశారని వరుణ్ తెలిపాడు.

  • Loading...

More Telugu News