: నా ప్రేమ లేఖ మా ఇంట్లే వాళ్లే చదివేశారు...చాలా ఇబ్బందిగా అనిపించింది: అవసరాల శ్రీనివాస్


తన జీవితంలో ఒకే ఒకసారి ప్రేమ లేఖ రాశానని నటుడు, రచయిత, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తెలిపాడు. హైదరాబాదులో జరిగిన 'కంచె' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, ప్రేమ లేఖ రాసేసిన తరువాత మరోసారి చదువుకుని, ఇంత అద్భుతమైన ప్రేమ లేఖ ఇచ్చేస్తే ఎలా అని ఆలోచించి, దానిని జిరాక్స్ తీసి దాచుకున్నానని చెప్పాడు. అయితే, దానిని చివరికి తన కుటుంబ సభ్యులు చదివేశారని, అది చాలా ఇబ్బందిగా అనిపించిందని తెలిపాడు. క్రిష్ సొంతంగా ప్రేమ లేఖలు రాసి ఉండరని, అలా రాసి ఉంటే ఈపాటికే అందరికీ తెలిసిపోయి ఉండేదని శ్రీనివాస్ చమత్కరించాడు.

  • Loading...

More Telugu News