: కేసీఆర్ ను లెక్కలడుగుతున్న మధుయాష్కీ
చైనా వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, అలాగే గతంలో సింగపూర్ పర్యటన, ఇప్పుడు చైనా పర్యటనకు ఎంత ఖర్చు చేశారో, ఆ పర్యటనల వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన మేలు ఎంతో చెప్పాలని అడిగారు. ప్రజా ధనంతో విదేశీ పర్యటనలకు వెళ్లడం ఫ్యాషన్ అయిపోయిందని ఆయన విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు అధికారికంగా జరపడం లేదో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు వెల్లడించాలని ఆయన అడిగారు. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో విమోచన దినోత్సవం జరపడం లేదంటూ ముఖ్యమంత్రులను విమర్శించిన కేసీఆర్ అధికారంలో ఉండి కూడా విమోచన దినోత్సవం ఎందుకు జరపడం లేదని ఆయన నిలదీశారు.