: మోత్కుపల్లి, బలరాంనాయక్ అరెస్టు
హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేష్ మృతిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఆందోళనకు దిగారు. సీఐడీ కాకుండా, సీబీఐ విచారణకు ఆదేశించని పక్షంలో మృతదేహాన్ని తెలంగాణ హోం మంత్రి నివాసానికి తీసుకెళ్లి అక్కడ ధర్నా చేస్తామని ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన ఈ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.