: లిబియాలో తెలుగు వారు క్షేమం... ఆందోళన వద్దు: అర్జా శ్రీకాంత్
లిబియాలో ఉగ్రవాదుల చెరలో ఉన్న తెలుగువారు క్షేమంగా ఉన్నారని ఏపీ అదనపు రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, అపహరణకు గురైనవారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ట్రిపోలిలోని రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడుతున్నామని ఆయన చెప్పారు. ఉగ్రవాదులు విద్యుత్, టెలిఫోన్, మొబైల్, రహదారి వ్యవస్థలను ధ్వంసం చేశారని, దీంతో సిర్తే పట్టణానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని తెలిపారు. అందువల్లే చెరలో ఉన్నవారితో కమ్యూనికేట్ చేయడం కుదరలేదని ఆయన తెలిపారు. వారి విషయంలో ఆందోళన చెందవద్దని, వారిని విడిపించేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామని ఆయన చెప్పారు.