: ఖైరతాబాద్ వినాయకుడి వద్ద వైఫై సేవలు ప్రారంభించిన సాయిధరమ్ తేజ్
హైదరాబాదు, ఖైరతాబాద్ గణపతిని దర్శించేందుకు వచ్చే భక్తులకు ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. మహాగణపతి పరిసరాల్లో జియో సంస్థ ఉచిత వైఫై సేవలు అందించనుంది. ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర నిత్యం భక్తుల సందడి నెలకొంటుంది. భారీ క్యూలైన్లు ఉంటాయి, అలాంటప్పుడు దేవుడిని దగ్గరగా దర్శించుకోవాలని భావించే భక్తులు అసహనానికి లోనయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా దేవుడి పాటలు వినేందుకు, ఇతర సాంకేతిక సమాచారం తెలుసుకునేందుకు ఉచిత వైఫై సేవలు ఉపయోగపడతాయని జియో సంస్థ తెలిపింది. ఈ జియో ఉచిత వైఫై సేవలను ప్రముఖ సినీ యువనటుడు సాయి ధరమ్ తేజ్ ప్రారంభించడం విశేషం.