: ఒక్కొక్కరికి రూ.1.76 కోట్లు... మక్కా మృతులకు ‘సౌదీ’ భారీ పరిహారం


ముస్లింలు పరమ పవిత్రంగా భావించే మక్కా మసీదులో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన వారికి సౌదీ అరేబియా ప్రభుత్వం భారీ పరిహారాన్ని ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరికి రూ.1.76 కోట్ల(ఒక మిలియన్ సౌదీ రియాళ్లు)ను పరిహారంగా ఇవ్వాలని సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆదేశాలు జారీ చేశారని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. శాశ్వత అంగవైక్యలం ప్రాప్తించిన వారికి కూడా ఇంతే మొత్తాన్ని పరిహారంగా అందించనున్నట్లు తెలిపింది. ఇక ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి రూ.88.35 లక్షల(5 లక్షల రియాళ్లు) చొప్పున పరిహారంగా అందించాలని కూడా రాజు ఆదేశించినట్లు పేర్కొంది. భారీ క్రేన్ కుప్పకూలిన ప్రమాదంలో 12 మంది భారతీయులు (వీరిలో నలుగురు ఏపీ వాసులు) సహా 107 మంది మృత్యువాతపడ్డ సంగతి తెలిసిందే. 238 మందికి గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే, ప్రమాదానికి కారణమైన సౌదీ బిన్ లాడెన్ గ్రూపుపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ కంపెనీలో పనిచేస్తున్న 60 వేల మందిలో భారతీయులే అధిక సంఖ్యలో ఉన్నారు. సౌదీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ కంపెనీలో పనిచేస్తున్న భారతీయుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

  • Loading...

More Telugu News