: 14 నెలలుగా ఈడీకి చుక్కలు చూపిస్తున్న పునీత్ దాల్మియా... శిక్షించాలంటూ కోర్టులో ఈడీ పిటిషన్


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దాల్మియా సిమెంట్స్ అధినేత పునీత్ దాల్మియా ఒక్క సీబీఐకే కాదు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు కూడా చుక్కలు చూపిస్తున్నారు. అదేదో నెలో, రెండు నెలలో అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఏకంగా 14 నెలల నుంచి ఆయన ఈడీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. విచారణకు హాజరుకావాలన్న ఈడీ నోటీసులకు ఆయన అసలు స్పందించడమే లేదట. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న దాల్మియాను విచారించేందుకు ఇప్పటికే ఈడీ ఆరుసార్లు నోటీసులు జారీ చేసింది. వీటిలో ఏ ఒక్క నోటీసుకు కూడా దాల్మియా నుంచి స్పందన రాలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఈడీ అధికారులు నిన్న నాంపల్లి చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. దర్యాప్తునకు ఏమాత్రం సహకరించని దాల్మియాపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ జరిపిన న్యాయమూర్తి... దాల్మియాపై కోర్టు తరఫు నుంచి నోటీసులు జారీ చేసే విషయంపై నిర్ణయాన్ని ఈ నెల 22కు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News