: కేసీఆర్ ఎన్నికల ఖర్చు నివేదికలో రూ.30 లక్షల తేడా వచ్చిందంటున్న ఏడీఆర్


అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు కోట్లాది రూపాయాలు గుమ్మరిస్తున్నారు. ఆనక నిర్దేశిత పరిధిలోనే ఖర్చు చేశాం, లక్ష్మణ రేఖ ఏమాత్రం దాటలేదని చెబుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి కాకమ్మ కథలు చెబుతున్నారు. ఇందులో ఏ ఒక్కరికీ మినహాయింపు లేదు. ఎందుకంటే, అన్ని పార్టీల్లోనూ ఈ తరహా విచిత్ర వైఖరి ఎప్పటికప్పుడు వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా మొన్నటి ఎన్నికల ఖర్చుకు సంబంధించి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమర్పించిన లెక్కలకు, ఆయన కోసం టీఆర్ఎస్ పెట్టిన ఖర్చుకు పొంతన కుదరలేదట. ఇలా పొంతన కుదరని మొత్తం ఏ వెయ్యో, రెండు వేలో కాదు... ఏకంగా రూ.30 లక్షల మేర అంతరం ఉందని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ (ఏడీఆర్) తేల్చిచెప్పింది. మొన్నటి ఎన్నికల్లో తాను రూ.70,05,000 ఖర్చుపెట్టానని కేసీఆర్ ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించారు. అయితే పార్టీగా టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి అందజేసిన నివేదికలో మాత్రం కేసీఆర్ కు రూ.కోటి విడుదల చేసినట్లు తెలిపింది. అంటే, పార్టీ ఇచ్చిన ఇంకో రూ.30 లక్షలను కేసీఆర్ తన చిట్టా పద్దుల జాబితాలో చేర్చలేదన్నమాట. ఇదే విషయాన్ని ఏడీఆర్ తన నివేదికలో ప్రధానంగా ప్రస్తావించింది.

  • Loading...

More Telugu News