: 19న టీ కేబినెట్ భేటీ... కేసీఆర్ చైనా పర్యటన, పెట్టుబడులపైనే ప్రధాన చర్చ
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 19న జరగనుంది. త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు, నిన్నటితో ముగిసిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చైనా పర్యటన, రాష్ట్రానికి పెట్టుబడుల రాక తదితర అంశాలపై ఈ భేటీలో కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం. పది రోజుల పాటు చైనాలో పర్యటించిన కేసీఆర్ నిన్న సాయంత్రం హైదరాబాదు చేరుకున్నారు. కొత్త రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టడమే ప్రధాన లక్ష్యంగా చైనాలో పర్యటించిన కేసీఆర్ మెరుగైన ఫలితాలనే సాధించినట్లు తెలుస్తోంది. చైనా పర్యటన వివరాలను కేబినెట్ భేటీలో కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులకు వివరించనున్నారు. అంతేకాక రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా కేబినెట్ దృష్టి సారించనుంది.