: చిన్నశేష వాహనంపై ఊరేగుతున్న శ్రీవారు... ఊరేగింపులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు


తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీవారు చిన్నశేష వాహనంపై ఊరేగుతున్నారు. నిన్న ఘనంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ప్రస్తుతం శ్రీవారు తిరుమల మాడ వీధుల్లో చిన్నశేష వాహనంపై ఊరేగుతున్నారు. తిరువీధులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. నేటి ఉదయం తిరుమల చేరుకున్న టాలీవుడ్ అగ్ర దర్శకుడు, టీటీడీ బోర్డు సభ్యుడు రాఘవేంద్రరావు స్వామి వారి ఊరేగింపులో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News