: ప్రియుడితో పెళ్లి జరిపించకుంటే దూకి చస్తా... వరంగల్ లో సెల్ టవరెక్కిన యువతి


ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలని, లేని పక్షంలో పైనుంచి దూకి చస్తాననంటున్న ఓ యువతి బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. వరంగల్ జిల్లా గూడూరులో నేటి ఉదయం ఓ యువతి అక్కడి సెల్ టవర్ ఎక్కేసింది. ప్రేమ పేరిట ఓ యువకుడు తనను మోసం చేశాడని ఆరోపించిన ఆ యువతి, అతడితోనే తనకు పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తోంది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయకుంటే టవర్ పై నుంచి దూకి చస్తానని కూడా ఆ యువతి హెచ్చరికలు జారీ చేసింది. యువతి హెచ్చరికల నేపథ్యంలో గూడూరులో కలకలం రేగింది. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News