: చిలీలో పెను భూంకంపం... సునామీ హెచ్చరికలు జారీ
చిలీలో నేటి ఉదయం పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.4 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం తర్వాత ఆరుసార్లు అక్కడి భూమి కంపించింది. ఈ ప్రకంపనల తీవ్రత కూడా రిక్టర్ స్కేలుపై 6 కంటే అధికంగానే నమోదైంది. ఈ భూకంపం కారణంగా ఆ దేశంలోని పలు భవనాలు పేకమేడల్లా కుప్పకూలినట్లు ప్రాథమిక సమాచారం. ఇప్పటికే ఓ వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక భూకంపం తీవ్రతతో భవనాలు చిగురుటాకులా వణికిపోయాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. భారీ తీవ్రతతో కూడిన భూకంపం నేపథ్యంలో చిలీతో పాటు పెరూ, హవాయి దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే సునామీ అలలు చిలీ తీరాన్ని తాకినట్లు కూడా సమాచారం. భారీ భూకంపం, సునామీ హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం ఆ దేశాల్లో భయానక వాతావరణం నెలకొంది.