: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం కసరత్తు... నేడు నీతి ఆయోగ్ ప్రత్యేక భేటీ


రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ కు ఎట్టకేలకు ‘ప్రత్యేక హోదా’ ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రత్యేక హోదా మినహా మిగతా విషయాల్లో ఎలాంటి సాయం కావాలో చెప్పాలంటూ ఇటీవల ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని చంద్రబాబు పట్టుబట్టినట్టు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో అసలు ఏపీకి ఏమేం కావాలో చూడండంటూ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాకు అక్కడికక్కడే మోదీ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై ఇప్పటిదాకా ఆయా అంశాలవారీగా పరిశీలన జరిపిన పనగారియా నేడు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటనకు అడ్డంకిగా నిలిచిన పలు అంశాలపై ఆయన దృష్టి సారించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వివిధ అంశాల కింద రాష్ట్రానికి చేయాల్సిన సాయం, ఇప్పటిదాకా చేసిన సాయం, ప్రజలు కోరుకుంటున్నట్లు ప్రత్యేక హోదా ప్రకటన తదితరాలపై సమావేశంలో కీలకంగా చర్చించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News