: చేయిపట్టి లాగిన ఎర్రబెల్లి...భుజంతట్టిన కేటీఆర్!


హైదరాబాదులోని శంషాబాద్ లోని త్రిరంగానగర్ లోని దివ్యసాకేతంలో మై హోం గ్రూపు అధినేత రామేశ్వరరావు షష్టిపూర్తి మహోత్సవం ఆసక్తికర ఘటనలకు వేదికైంది. తెల్లారి లేస్తే విమర్శల వాన కురిపించుకునే టీడీపీ నేత ఎర్రబెల్లి, మంత్రి కేటీఆర్ మధ్య సాన్నిహిత్యాన్ని బయటపెట్టింది. రామేశ్వరరావును విష్ చేసిన ఎర్రబెల్లి స్టేజీ దిగుతుండగా, కేటీఆర్ ఎదురుపడ్డారు. ప్రైవేటు ఫంక్షన్ కావడంతో ఇద్దరూ స్వేచ్ఛగా పలకరించుకున్నారు. ఈ సన్నివేశం అక్కడున్న అందర్నీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్ ను చేయిపట్టిలాగగా; కేటీఆర్, ఎర్రబెల్లి భుజం తట్టారు. అనంతరం ఎర్రబెల్లి స్టేజీ దిగిపోగా, కేటీఆర్ రామేశ్వరరావును విష్ చేసేందుకు వెళ్లారు.

  • Loading...

More Telugu News