: కక్కుర్తి 'పోలీస్' దొంగ అరెస్టు


జమ్మూకాశ్మీర్ లో నానక్ నగర్ ప్రాంతంలో ఓ జ్యుయలరీ షాపు ముందు ఏర్పాటు చేసిన సీఎఫ్ఎల్ బల్బులు దొంగిలించిన ఎస్సైని అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్ లో ఎక్సైజ్ ఎస్సైగా విధులు నిర్వర్తించే వికాస్ ఖుజురియా ఓ రోజు రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తూ, నానక్ నగర్ లో షాపు ముందు ఏర్పాటు చేసిన బల్బులు దొంగిలించి స్కూటర్ డిక్కీలో పెట్టి తీసుకెళ్లిపోయాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ షాపు యజమాని దాని గురించి ఎవరికీ చెప్పకుండా...'కక్కుర్తి పోలీస్ దొంగ' అని క్యాప్షన్ పెట్టి దానిని సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే, ఆ వీడియో క్షణాల్లో వైరల్ లా పాకిపోయింది. 'మన పోలీసుల తీరు ఇది' అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించి విమర్శలు చేశారు. ఇది ఆ నోటా ఈ నోటా పాకి పై అధికారులకు తెలియడంతో, అతనిని అదుపులోకి తీసుకున్నారు. అయితే గత కొంత కాలంగా ఖుజురియా ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, అందుకే ఇలా చేసి ఉంటాడని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News